logo

హమ్మయ్య.. యూరియా వచ్చింది

ఎట్టకేలకు జిల్లా వ్యాప్తంగా మంగళవారం యూరియా దిగుమతి అయింది. ‘యూరియా ఎక్కడ?’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

Published : 01 Feb 2023 05:04 IST

దిగుమతి చేస్తున్న కూలీలు

చల్లపల్లి గ్రామీణం,న్యూస్‌టుడే: ఎట్టకేలకు జిల్లా వ్యాప్తంగా మంగళవారం యూరియా దిగుమతి అయింది. ‘యూరియా ఎక్కడ?’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం మోపిదేవి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి 20 టన్నుల ఎరువు సరఫరా అయింది. చల్లపల్లి మండలంలోని ఆర్‌బీకే, గ్రోమోర్‌, తదితరాలు 50 టన్నుల సరకు రానుందని చల్లపల్లి ఏవో తెలిపారు. బుధవారం ఉదయానికి స్టాకు సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. వారం రోజులుగా కాంప్లెక్స్‌ కొంటేనే యూరియా ఇస్తామన్న నిబంధన యూరియా రాకతో సమసిపోతుందని రైతులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు