సంక్షేమమా ఏదీ నీ చిరునామా..?
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. వారి కోసం సంక్షేమ బోర్డు ఉన్నప్పటికీ పేరుకే పరిమితమైంది.
మట్టి ఖర్చుల్ని కూడా విదల్చని ప్రభుత్వం
రోడ్డున పడుతున్న భవన నిర్మాణ కార్మికులు
న్యూస్‌టుడే, గుడివాడ(నెహ్రూచౌక్)
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. వారి కోసం సంక్షేమ బోర్డు ఉన్నప్పటికీ పేరుకే పరిమితమైంది. కార్మికుల సంక్షేమానికి ఇంతవరకు నిధులు విడుదల చేసిన పాపాన పోలేదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక వైపు పనులు లేక.. మరో వైపు ప్రభుత్వం ఆదుకోక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నామని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. పనులు లేక పొట్ట చేత పట్టుకొని ఇప్పటికే చాలా మంది వలస పోతున్నారని.. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత మంది అదే బాట పట్టాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
జాడ లేని చట్టం
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్మికుల సంక్షేమ నిధిని ప్రభుత్వం ఇతర పథకాలకు దారి మళ్లించడం సరికాదని తప్పు పడుతున్నాయి. కార్మిక శాఖ కార్యాలయంలో తీసుకున్న ప్రతి దరఖాస్తుకు కనీసం రశీదు ఇచ్చే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. తాపీ కార్మికులకు ఇంతవరకూ గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేయలేదు. చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు నిధులు విడుదల చేయడం లేదు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోవడంతో ప్రభుత్వం కరవు భత్యం ఇస్తామని చెప్పి ఇంతవరకూ చెల్లించలేదు.
వందలాది క్లైయిమ్స్ పెండింగులో
జిల్లాలో చనిపోయిన కార్మికులకు సంబంధించిన దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగులో ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం దారుణమని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. నగర, పురపాలక సంఘాల్లో వసూలు చేసే పన్ను కూడా కార్మికుల సంక్షేమానికి వినియోగించడం లేదని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. గుడివాడలో 2019లో చనిపోయిన భవన నిర్మాణ కార్మికుడు ఎం.అశోక్ కుటుంబ సభ్యులు మట్టి ఖర్చుల కోసం దరఖాస్తు చేసుకొని మూడేళ్లు కావస్తున్నా ఇంతవరకూ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని సీఐటీయూ నాయకులు విమర్శిస్తున్నారు.
వలస బాట తప్పదు
పెరిగిన ఇనుము, సిమెంటు ధరలు.. ఇసుక కొరత వలన భవన నిర్మాణ రంగం ఇప్పటికే కుదేలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ రంగానికి ఊతమిచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోకపోతే ఉపాధి కోసం వలస బాట పట్టక తప్పదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
ప్రభుత్వం గాలికొదిలేసింది
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. తమకు ఎటువంటి పథకాలు అమలు చేయకూడదని మెమో నెం. 1214 విడుదల చేయడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం కనీసం చనిపోయిన వారి కుటుంబాలకు మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు.
రేపాని కొండ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రభుత్వం ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఉపాధి కోసం వలసబాట పట్టకు తప్పదు. మా నిధుల్ని కూడా దారి మళ్లించడం అన్యాయం. దీనిపై ప్రభుత్వం స్పందించాలి.
బండి శ్రీను, తాపీ మేస్త్రి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..
-
India News
Amritpal Singh: ‘ఆపరేషన్ అమృత్పాల్’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!
-
Movies News
RRR: ‘ఆస్కార్’కు అందుకే వెళ్లలేదు.. ఆ ఖర్చు గురించి తెలియదు: ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత