logo

మిల్లర్ల అభ్యంతరాలపై ఫోన్‌ చేయండి

రంగుమారిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతు భరోసా కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యంపై మిల్లర్లు ఏమైనా అభ్యంతరాలు చెప్తే తనకు లేదా జేసీకి ఫోన్‌ చేయాలని కలెక్టరు రంజిత్‌ బాషా తెలిపారు.

Published : 01 Feb 2023 05:10 IST

సర్పంచి, రైతులతో మాట్లాడుతున్న రంజిత్‌ బాషా

మర్రివాడ (పమిడిముక్కల), న్యూస్‌టుడే: రంగుమారిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతు భరోసా కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యంపై మిల్లర్లు ఏమైనా అభ్యంతరాలు చెప్తే తనకు లేదా జేసీకి ఫోన్‌ చేయాలని కలెక్టరు రంజిత్‌ బాషా తెలిపారు. గ్రామదర్శినిలో భాగంగా ఆయన మంగళవారం మర్రివాడను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ ధాన్యం ఆర్బీకేల ద్వారా మిల్లుకు తోలగా మిల్లర్లు ధర విషయంలో అభ్యంతరాలు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. రంగు మారాయనే నెపంతో అతి తక్కువ ధరకు అడుగుతున్నారని మరి కొంతమంది రైతులు తెలిపారు. మహిళల్లో రక్తహీనత పరీక్షల గురించి కలెక్టరు సచివాలయంలో ఏఎన్‌ఎమ్‌ను వివరాలు అడిగారు. అంగన్‌వాడీ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులను పరీక్షించారు. పాఠశాలకు ప్రహరీ, అదనపు తరగతి గది కావాలని ప్రధానోపాధ్యాయుడు రమేష్‌ కోరారు. రోడ్ల ఆక్రమణలు తొలగించాలని, డ్రైనేజీ సమస్య, గ్రామంలో తాగునీటి కొరత తీర్చాలని, పాఠశాల పక్కనేగల చెరువును అభివృద్ధి చేయాలని సర్పంచి వంపుగడల ఫ్రాన్సిస్‌ కోరారు. అనంతరం జగనన్న కాలనీని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామదర్శిని తనిఖీ అధికారి ఏడీ ఫిషరీస్‌ శాఖ డి.సాంబశివరావు, ఎంపీడీవో సుధాప్రవీణ్‌, తహసీల్దారు కట్టా శివయ్య, ఎంఈవో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని