logo

చర్చనీయాంశంగా వైకాపా శ్రేణుల కొట్లాట

ఈనెల 28న నాగాయలంకలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అనుచరుడు శివను అవనిగడ్డ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రమేష్‌బాబు అనుచరులు కొట్టి చంపేస్తామని బెదిరించారని, పోలీసులు చూస్తూ ఊరుకోగా, సీఐ తనను కాపాడారని జిల్లా ఎస్పీకి శివ చేసిన ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది.

Published : 01 Feb 2023 05:10 IST

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ఈనెల 28న నాగాయలంకలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అనుచరుడు శివను అవనిగడ్డ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రమేష్‌బాబు అనుచరులు కొట్టి చంపేస్తామని బెదిరించారని, పోలీసులు చూస్తూ ఊరుకోగా, సీఐ తనను కాపాడారని జిల్లా ఎస్పీకి శివ చేసిన ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది. ఇది కొట్లాటగానే ఉంటుందా, లేక భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందా అనే విషయమై పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఎంపీ సూచన మేరకే బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లి ఉంటుందని, ఆయన ఎలా స్పందిస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుపై నలుగురిని అరెస్టుచేసి, నాగాయలంకలో స్టేషన్‌ బెయిలు ఇచ్చి పంపించారని చెప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిర్యాదులో ఎవరి పేర్లు ఇచ్చారనేది ఊహాగానంగా చెప్పుకుంటున్నారు. ఈ కేసు విషయంలో మచిలీపట్నం, గుడివాడ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకున్నట్లు ప్రచారం జరగడంతో భవిష్యత్తులో ఎంపీ బాలశౌరి తన నియోజకవర్గంలోని ఆ ప్రజాప్రతినిధులతో ఎలా కలిసి పనిచేస్తారని, అందువలన వేరు కుంపట్లు తప్పవని వ్యాఖ్యానిస్తున్నారు. కార్యకర్తల మధ్య కొట్లాట చిలికి చిలికి గాలివానగా మారి చివరికి ప్రజాప్రతినిధుల మధ్య గొడవకు దారితీసే ప్రమాదం ఏర్పడింది.  

* గత నెల 28న నాగాయలంకలో జరిగిన కొట్లాటతో రేపల్లె దామోధర్‌, మరి కొందరు తనను కొట్టి, చంపేస్తామని బెదిరించారని ఎంపీ బాలశౌరి అనుచరుడు గరికిపాటి శివ ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగాయలంక స్టేషన్‌లో కేసు నమోదైందని సీఐ జి.శ్రీనివాస్‌ చెప్పారు. రేపల్లె దామోదర్‌, మరి కొందరు తనను కొట్టినట్లు చేసిన ఫిర్యాదుపై అనుమానితులపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఎవర్నీ అరెస్టు చేయలేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు