logo

ఈ లేఔట్లోకి వెళ్లేదెలా ?

కోడూరులో సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న జగనన్న లేఔట్లోని ప్రధాన రహదారి రోజుకో రకంగా ఆక్రమణలకు గురికావడం, వరి నాట్లు వేయడం వంటి సంఘటనలతో లోపలకు వెళ్లడానికి రహదారి లేకుండా పోతోంది.

Published : 01 Feb 2023 05:16 IST

ఆక్రమణలకు గురౌతున్న రహదారి

లేఔట్‌ పక్కనే తవ్విన పెద్ద గొయ్యి (డ్రైనేజీ)

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: కోడూరులో సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న జగనన్న లేఔట్లోని ప్రధాన రహదారి రోజుకో రకంగా ఆక్రమణలకు గురికావడం, వరి నాట్లు వేయడం వంటి సంఘటనలతో లోపలకు వెళ్లడానికి రహదారి లేకుండా పోతోంది. లబ్ధిదారులను ఎంపిక చేసి, పట్టాలిచ్చి రెండేళ్లు గడిచినా రహదారి సౌకర్యం లేక లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టినా ముందుకు సాగని పరిస్థితి. ఇసుక, కంకర, ఇటుకలు లోపలకు తీసుకువెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కొంత మంది రహదారిని ఆక్రమించి నాట్లు వేసినా పట్టించుకోని అధికారులు, బోదులు తవ్వించినా కూడా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని లబ్ధిదారులు ఆశ్చర్యపోతున్నారు. జేసీబీతో మురుగు నీరు బయటకు పోవడానికి బోదు తవ్వించినా కూడా అధికారులు స్పందించడం లేదని, అటువంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని