logo

అర్హత ఉన్నా.. అందని సాయం

విజయవాడ గవర్నర్‌పేట, మూజియం రోడ్లో రిక్షా కార్మికుడిగా బతికే నాగేశ్వరరావు (67)కు ఎవరూ లేరు. తల్లిదండ్రులు చనిపోగా పెళ్లి కూడా చేసుకోకుండా రిక్షా తొక్కుతూ.. ఐవీప్యాలెస్‌ రోడ్లో గుడారం వేసుకుని జీవనం సాగిస్తున్నారు.

Published : 01 Feb 2023 06:31 IST

విజయవాడ గవర్నర్‌పేట, మూజియం రోడ్లో రిక్షా కార్మికుడిగా బతికే నాగేశ్వరరావు (67)కు ఎవరూ లేరు. తల్లిదండ్రులు చనిపోగా పెళ్లి కూడా చేసుకోకుండా రిక్షా తొక్కుతూ.. ఐవీప్యాలెస్‌ రోడ్లో గుడారం వేసుకుని జీవనం సాగిస్తున్నారు. శక్తి ఉన్నన్నాళ్లూ  కష్టపడి రిక్షా తొక్కుతూ వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవారు. వయసు మీదపడి కష్టంగా ఉండడంతో 2021 డిసెంబరులో ప్రభుత్వ పింఛను కోసం దరఖాస్తు చేశారు. ఆధార్‌కార్డులో వయసు తప్పుగా ఉందని అధికారులు పింఛను మంజూరు చేయలేదు. డాక్టర్లు, అధికారుల చుట్టూ తిరిగి తనకు 67 ఏళ్ల వయసుందని.. ఆధార్‌లో మార్చులు చేసుకుని 2022 జనవరిలో మళ్లీ పింఛను కోసం దరఖాస్తు చేశారు. ఏడాది అవుతున్నా ఇప్పటికీ పింఛను మంజూరు కాలేదు.
ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని