పింఛను.. ఎంత మందికి నిలిచేనో..!
విజయవాడ నగరం పటమట ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు 2009లో ప్రభుత్వ ఆసుపత్రిలో అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు
అర్హత రుజువు బాధ్యత లబ్ధిదారులదే
దివ్యాంగులకు అందని సదరం ధ్రువీకరణ
ఈనాడు, అమరావతి
* విజయవాడ నగరం పటమట ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు 2009లో ప్రభుత్వ ఆసుపత్రిలో అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. ప్రస్తుతం అది చెల్లదని, తాజాగా మీసేవా ద్వారా తీసుకురావాలని పింఛను నిలుపుదల చేశారు. దీనికి ఆయన స్లాట్ నమోదు చేసుకుంటే 350 మంది తర్వాత వెయిటింగ్ జాబితా వచ్చింది. ఈ ధ్రువీకరణ పత్రం రావడానికి కనీసం రెండు నెలలు పడుతుందని విజ్ఞప్తి చేసుకున్నా పింఛను పునరుద్ధరించే పరిస్థితి లేదు. ప్రస్తుతం వచ్చే నెల ఆయనకు పింఛను వస్తుందా రాదా అనేది సందేహం.
*ఆమె 36 ఏళ్ల ఒంటరి మహిళ. ప్రస్తుతం 50 ఏళ్లు ఉంటేనే పింఛనుకు అర్హత అని నిలుపుదల చేయనున్నారు. మరో కారణం.. ఆమె భర్త పేరు బియ్యం కార్డులో ఉందని, ఈ కారణంగా ఆమె ఒంటరి మహిళ కాదని, భర్త ఉన్నట్లు ధ్రువీకరించి పింఛను నిలుపుదల చేస్తున్నారు. ఫిబ్రవరి నెల మొదటి తారీఖున పింఛను వచ్చే అవకాశాలు లేవు.
ఇలా ఒకటా రెండా.. విజయవాడ నగరంలోనే దాదాపు 4వేల పింఛన్లపై వేటు పడనుంది. ఫిబ్రవరి మొదటి తారీఖున అందే పింఛను ఎంత మందికి ఆగిపోతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పింఛన్లు ఇచ్చామని చెబుతున్న అధికారులు పాత వాటికి ఎగనామం పెడుతున్నారు. ఇప్పటికే అనర్హుల జాబితా సిద్ధమై సచివాలయాల్లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. వారిలో అర్హులు ఎంతమంది అనేది రుజువు చేసుకునే బాధ్యత లబ్ధిదారుల పైనే మోపారు. కొంత మంది తమ అర్హత రుజువు పత్రాలు అందించారు. కొంత మంది ఇంకా ధ్రువీకరణ పత్రాలు అందక వేచి చూస్తున్నారు. వీరి పింఛన్లు ఫిబ్రవరి నెలలో నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. అనర్హుల జాబితా సిద్ధమై మెప్మా, డీఆర్‌డీఏ కార్యాలయాలకు గత నెలలోనే చేరినా.. లబ్ధిదారులకు సమాచారం లేదు. నోటీసులు అందుకోలేదు. కొంతమందికే నోటీసులు అందాయి. తాము పంపామని అధికారులు చెబుతున్నారు. కొంతమందికి దీనిపై సరైన అవగాహన లేదు. ఇటీవల కాలంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను పింఛన్లపై లబ్ధిదారులు నిలదీశారు. చాలా మంది ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా అధికారులకు ఎమ్మెల్యేలు పింఛన్లు తొలగించవద్దని కొరినట్లు తెలిసింది. అయినా జాబితా సిద్ధం కావడంతో అనర్హులకు సొమ్ములు ఇచ్చే అవకాశం లేదని తెలిసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 14వేల లబ్ధిదారులను ఆరు సూత్రాల ప్రకారం అనర్హుల జాబితాలో పెట్టారు. వీరిలో ఎంత మంది అర్హత సాధించారనేది మాత్రం ఈ నెల సచివాలయాల్లో జాబితా ప్రదర్శించలేదు.
లబ్ధిదారుడిపైనే బాధ్యత...
వైఎస్సార్ పింఛను కానుక తొలగించేందుకు ఆరు సూత్రాల విధానం పాటించినా పలు తప్పులు దొర్లాయి. వీటిని రుజువు చేసుకునే బాధ్యత లబ్ధిదారులపైనే మోపారు. ఉమ్మడి జిల్లాలో 2019 తర్వాత దాదాపు 52,542 కొత్త పింఛన్లు ఇచ్చారు. ప్రతి ఏడాది పెంచుతూ వృద్ధులకు ఇప్పటివరకు రూ.2,500 చేశారు. ప్రధానంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛను ఎక్కువగా ఇస్తున్నారు. వీరితో పాటు దివ్యాంగులు, వివిధ కేటగిరీల కింద ఇస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచనుగా లబ్ధిదారులకు వాలంటీర్లతో వారి ఇంటి వద్దనే అందిస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. దీనిపై గతంలోనే అర్హత విషయంలో సర్వేలు జరిగాయి. బియ్యం కార్డులను కొన్నింటిని తొలగించిన విషయం తెలిసిందే. ఇంటి స్థలం ఉన్నా గ్రామీణంలో వ్యవసాయ భూమి ఉన్నా.. 300 యూనిట్లు విద్యుత్తు వాడకం ఉన్నా.. ఏసీలు, ఫ్రిజ్‌లు ఉన్నా..(అంటే యూనిట్లు 300 దాటితే) బియ్యం కార్డులు తొలగించారు. వీటికి తోడు ఆదాయ పన్ను చెల్లిస్తున్నా, కారు ఉన్నా అనర్హులుగా ప్రకటించారు. ఏదో ఒక సాకుతో ప్రత్యర్థుల సానుభూతిపరుల పింఛన్లు తొలగించేందుకు రంగం సిద్ధం చేశారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. అనర్హుల జాబితాలో ఎక్కువగా తెదేపా సానుభూతి పరులే ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం జరిగిన వీఎంసీ కౌన్సిల్‌లోనూ తెదేపా కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క విజయవాడ నగరంలోనే 4వేల మంది అనుర్హులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. వీరిలో ప్రస్తుతం 2వేల మందికి పింఛను సొమ్ములు ఆగిపోయినట్లు తెలిసింది. అసలు స్థిరాస్తి లేకపోయినా.. స్థలం ఉన్నట్లు చాలా మందికి చూపించారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆస్తులను జాబితాలో పేర్కొంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!
-
India News
Chandigarh University: పరీక్షలో పాటలే సమాధానాలు.. లెక్చరర్ కామెంట్‌కు నవ్వులే నవ్వులు
-
India News
Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శీలింధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్‌లో!
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Movies News
Aditya Om: ఇంకా బతికే ఉన్నారా? అని కామెంట్ చేసేవారు: ఆదిత్య ఓం
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!