logo

రోజూ నీళ్ల పప్పే పెడుతున్నారా?

పెడన పట్టణంలోని మూడు అంగన్‌వాడీ కేంద్రాలను డీఎస్‌వో వి.పార్వతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11గంటలకు స్థానిక 4,5 వార్డుల్లోని మూడు కేంద్రాలకు వెళ్లగా అన్నిచోట్లా అంగన్‌వాడీ కార్యకర్తలు లేకపోవడాన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 04 Feb 2023 03:27 IST

అంగన్‌వాడీ కార్యకర్తలపై డీఎస్‌వో ఆగ్రహం

అంగన్‌వాడీ కేంద్రంలో బాలలతో మాట్లాడుతున్న పార్వతి

పెడన, న్యూస్‌టుడే: పెడన పట్టణంలోని మూడు అంగన్‌వాడీ కేంద్రాలను డీఎస్‌వో వి.పార్వతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11గంటలకు స్థానిక 4,5 వార్డుల్లోని మూడు కేంద్రాలకు వెళ్లగా అన్నిచోట్లా అంగన్‌వాడీ కార్యకర్తలు లేకపోవడాన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు విధులకు గైర్హాజరై ఆయాలతో కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు ఆమె గుర్తించారు. మూడు కేంద్రాల కార్యకర్తలు ఝాన్సీరాణి, కరీమున్నీసా, కమ్రున్నీసాలపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. బాలలతో కొద్ది సేపు ముచ్చటించిన డీఎస్‌వో అక్కడ అందుతున్న ఆహారం, ప్రాథమిక విద్యపై ఆరాతీశారు. 4వ వార్డు కేంద్రంలో పప్పుకూర నీళ్లగా ఉండటాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ ఆహారాన్ని ఇలాగే వండి వడ్డిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అంగన్‌వాడీ కేంద్రాల రికార్డులు, బియ్యం, గుడ్లు ఇతర నిత్యావసరాల రిజిస్టర్లను తనిఖీచేశారు. అనంతరం 6వ సచివాలయ పరిధిలో మొబైల్‌ డిస్పెంసింగ్‌ యూనిట్‌(ఎండీయూ) ద్వారా ఇంటింటికి జరుగుతోన్న నిత్యావసరాల పంపిణీని పరిశీలించి స్టాకులను తనిఖీ చేశారు. ఈపర్యటనలో వీఆర్వోలు సీహెచ్‌.రవి కిరణ్‌, కె.రవి భార్గవ్‌, మహిళా పోలీసు ఫజులున్నీసా బేగం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని