logo

ఉగాదికి 16 వేల గృహాలు పూర్తి చేయాలి

జిల్లాలో శ్లాబ్‌ స్థాయి వరకూ నిర్మాణదశలో ఉన్న పదహారువేల గృహాలను వచ్చే ఉగాది నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులకు సూచించారు.

Published : 04 Feb 2023 03:27 IST

అధికారులకు సూచించిన కలెక్టర్‌

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న రంజిత్‌బాషా

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాలో శ్లాబ్‌ స్థాయి వరకూ నిర్మాణదశలో ఉన్న పదహారువేల గృహాలను వచ్చే ఉగాది నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం జేసీ అపరాజితసింగ్‌తో కలిసి మండల స్థాయి అధికారులతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించిన కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. గృహ నిర్మాణాలతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల పురోగతిని వేగవంతం చేయాలని చెప్పారు. నిర్మాణాల్లో వెనుకబడి ఉన్న మండలాల్లో కారణాలపై ఆరా తీశారు. ఉయ్యూరు, తాడిగడప, పెనమలూరు, అవనిగడ్డ మండలాల్లో ప్రగతి చూపాలన్నారు. మెరక చేసిన లేఔట్‌ల్లోనూ నిర్మాణాల్లో పురోగతి లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆసక్తి చూపని లబ్ధిదారులతో మాట్లాడి రద్దు చేస్తామని హెచ్చరించాలన్నారు. వచ్చే సోమవారం ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పీఆర్‌ ఏఈలతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. జేసీ మాట్లాడుతూ కరగ్రహారం లేఔట్‌ను మెరక చేయడంతో పాటు నీరు, మెటీరియల్‌ అందుబాటులో ఉంచారని, స్వయం సంఘాల సభ్యులకు రూ.35వేలు రుణం ఇస్తున్నారని, అయినా నిర్మాణాలు ప్రారంభించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, హౌసింగ్‌ పీడీ జీవీ సూర్యనారాయణ అధికారులు పాల్గొన్నారు.

విదేశీ విద్యాదీవెనకు రూ.1.11 కోట్లు జమ

విదేశీ విద్యాదీవెన పథకం నిమిత్తం జిల్లాలోని 12 మంది విద్యార్థుల ఖాతాలకు తొలివిడతగా రూ.1.11 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్‌ రంజిత్‌బాషా తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల కార్యక్రమానికి వర్చువల్‌ విధానంలో కలెక్టర్‌, అధికారులు మచిలీపట్నం నుంచి హాజరయ్యారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మపర్సన్‌ జమలపూర్ణమ్మ, సంక్షేమశాఖల అధికారులు కె.సరస్వతి, ఫణిధూర్జటి, లక్ష్మీదుర్గ తదితరులతో పాటు లబ్ధిదారులైన విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని