logo

11వ పీఆర్‌సీ బకాయిలు ఏవీ?

‘రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

Published : 04 Feb 2023 03:27 IST

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : ‘రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 11వ పీఆర్‌సీ బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైంద’ని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని నిలదీశారు. 11వ పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలని, సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం విజయవాడ ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఓబులేసు మాట్లాడుతూ... 2022, ఏప్రిల్‌ వరకు అరియర్స్‌ చెల్లిస్తామని, డీఏ బకాయిలు సంపూర్ణంగా ఇస్తామని  మాట ఇచ్చి తప్పారని పేర్కొన్నారు.  గవర్నర్‌కు సమస్యలు చెబుదామని వెళ్లిన సూర్యనారాయణ బెదిరించడం దారుణమన్నారు. మధ్యంతర భృతి కంటే తక్కువగా పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ ఇవ్వడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బాలయ్య, పెన్షనర్‌ల యూనియన్‌ జాతీయ కార్యదర్శి నాగరాజు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, కోఆపరేటివ్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి కె.వి.ఎస్‌.రవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు