logo

కృష్ణాతీరం... కళాతపస్వితో అనుబంధం

సినీ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మృతికి నాట్యాచార్యులు, నాట్య విద్యార్థులు నృత్య నివాళులర్పించారు. శుక్రవారం కూచిపూడి నాట్యక్షేత్రంలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీసిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠంలో జరిగిన కార్యక్రమంలో వారు విశ్వనాథ్‌ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.

Updated : 04 Feb 2023 03:48 IST

విశ్వనాథ్‌ను సత్కరిస్తున్న గంగాధర్‌, బుద్ధప్రసాద్‌, ఎంపీ కొనకళ్ల (పాతచిత్రం)

కూచిపూడి, న్యూస్‌టుడే : సినీ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మృతికి నాట్యాచార్యులు, నాట్య విద్యార్థులు నృత్య నివాళులర్పించారు. శుక్రవారం కూచిపూడి నాట్యక్షేత్రంలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీసిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠంలో జరిగిన కార్యక్రమంలో వారు విశ్వనాథ్‌ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాతపస్వికి కూచిపూడితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2013 ఏప్రిల్‌ 1న కూచిపూడిలో ఏర్పాటు చేసిన పద్మభూషణ్‌ డాక్టర్‌ వెంపటి చినసత్యం కాంస్య విగ్రహావిష్కరణకు ఆయన విచ్చేశారని పేర్కొన్నారు. కళాపీఠం ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వేదాంతం రామలింగశాస్త్రి, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చింతా రవిబాలకృష్ణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఏలేశ్వరపు శ్రీనివాసులు, టీచింగ్‌ అసిసెంట్‌ డాక్టర్‌ వేదాంతం వెంకటదుర్గాభవాని, లైబ్రేరియన్‌ ఫణికుమార్‌, కళాపీఠం పర్యవేక్షకుడు పి.పార్థసారథి, ఎంపీఏ విద్యార్థులు పాల్గొన్నారు.

అవనిగడ్డలో ఆత్మీయ సత్కారం

అవనిగడ్డ, న్యూస్‌టుడే : ప్రముఖ దర్శకుడు దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌కు అవనిగడ్డతో మరచిపోలేని అనుబంధం ఉంది. ఆయన కృష్ణా మహోత్సవాలు, 2017 సెప్టెంబర్‌ 12న గాంధీక్షేత్రంలో జరిగిన నృత్య నీరాజనం, ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో చివరిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన్ను మండలి బుద్ధప్రసాద్‌, కొనకళ్ల నారాయణరావు, గాయకుడు ఎల్‌.గంగాధర్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తదితరులు పాల్గొని సత్కరించారు. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శన చేసిన విద్యార్థులతో కలిసి ఫొటో దిగారు. మండలి కుటుంబంతో ఆయనకు ఎనలేని అనుబంధం ఉంది.

కూచిపూడిలో 2013 ఏప్రిల్‌ 1న జరిగిన నాట్యాచార్యుడు డాక్టర్‌ వెంపటి చినసత్యం విగ్రహావిష్కరణలో పాల్గొన్న కె.విశ్వనాథ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని