logo

ద్విచక్ర వాహన దొంగల అరెస్టు

గుడివాడతోపాటు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు గుడివాడ టూటౌన్‌ సీఐ బి.తులసీధర్‌ తెలిపారు.

Published : 04 Feb 2023 03:27 IST

3 బైక్‌ల స్వాధీనం

దొంగలను అరెస్టు చేసి వారి నుంచి స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే : గుడివాడతోపాటు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు గుడివాడ టూటౌన్‌ సీఐ బి.తులసీధర్‌ తెలిపారు. శుక్రవారం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ వద్ద నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని బంటుమిల్లి రోడ్డులో ఓ వ్యక్తి తన ఇంటిముందు ఉంచిన వాహనం కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేశామన్నారు. ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన బాలసాని కిరణ్‌, బాలసాని వంశీ, గుడివాడకు చెందిన రాయల బాలరాజును నిందితులుగా గుర్తించామన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. వారిచ్చిన సమాచారం మేరకు మొత్తం మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టుకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ పి.ప్రకాశరావు, కానిస్టేబుల్‌ బాలకృష్ణను అధికారులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని