logo

రేపటి నుంచి ‘హెపటైటిస్‌ బి’ ఉచిత టీకా

హెచ్‌ఐవీ/ఇతర హైరిస్క్‌ గ్రూపుల వారికి కాలేయ వ్యాధుల బారి నుంచి సంరక్షణకు, ఈ నెల 6వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని ఎ.ఆర్‌.టి. కేంద్రాల్లో హెపటైటిస్‌ బి టీకా (వ్యాక్సిన్‌)ను ఉచితంగా వేయనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.

Published : 05 Feb 2023 05:18 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : హెచ్‌ఐవీ/ఇతర హైరిస్క్‌ గ్రూపుల వారికి కాలేయ వ్యాధుల బారి నుంచి సంరక్షణకు, ఈ నెల 6వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని ఎ.ఆర్‌.టి. కేంద్రాల్లో హెపటైటిస్‌ బి టీకా (వ్యాక్సిన్‌)ను ఉచితంగా వేయనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. నగరంలోని విడిది కార్యాలయంలో టీకా కార్యక్రమ పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ సోకిన వారితో పాటు, హైరిస్క్‌ గ్రూప్‌లోని సెక్స్‌ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లు, వలసదారులకు ఉచితంగా టీకా వేయనున్నుట్టు వెల్లడించారు. కామెర్లు, జ్వరం, అలసట, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, కడుపు నొప్పి, మూత్రం రంగు మారడం వంటివి వ్యాధి లక్షణాలని వివరించారు.  మూడు డోసులు తీసుకుని, వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారిణి ఉషారాణి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారిణి అమృత, జిల్లా కార్యక్రమ నిర్వహణ అధికారి కిరణ్‌ పండితి, జాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని