logo

నిర్వహణ పనుల తీరుపై ఆర్డీఓ విచారణ!

ఈ ఏడాది సాగునీటి కాలువల నిర్వహణ పనులు చేయకుండానే బిల్లులు తీసుకోవాలని భావించిన గుత్తేదారులకు చుక్కెదురైంది.

Published : 05 Feb 2023 05:33 IST

పనులు తనిఖీ చేస్తున్న అధికారులు

ఈనాడు, అమరావతి: ఈ ఏడాది సాగునీటి కాలువల నిర్వహణ పనులు చేయకుండానే బిల్లులు తీసుకోవాలని భావించిన గుత్తేదారులకు చుక్కెదురైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన సాగునీటి కాలువల నిర్వహణ పనులను తహశీల్దార్లు పర్యవేక్షించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ‘పనులు చేయకుండానే బిల్లులకు రంగం’ శీర్షికన జనవరి 20న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా విచారణకు ఆదేశించారు. ఉయ్యూరు ఆర్డీవో విజయ్‌కుమార్‌ను విచారణాధికారిగా వేశారు. జలవనరుల శాఖ ఇంజినీర్లు, ఆర్డీవో సంయుక్తంగా పనులను పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ నివేదికల ఆధారంగానే బిల్లులు చెల్లించాలని జలవనరు శాఖ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం రూ.50 కోట్లతో 267 పనులను చేపట్టారు. వీటిపై పరిశీలన జరగనుంది. ప్రస్తుతం ఆర్డీఓ విజయ్‌కుమార్‌ కంకిపాడు మండలంలో డ్రైనేజీని పరిశీలించారు. అన్ని మండలాల్లో నిర్వహణ పనులను పరిశీలన చేయాల్సి ఉందని చెబుతున్నారు. దీనిపై గుత్తేదారులు హైరానా పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని