logo

సీఎంఏతో ఉజ్వల భవిష్యత్తు

ప్రస్తుతం, రానున్న రోజుల్లో సీఎంఏ కోర్సు చదివిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ), సౌత్‌ ఇండియా రీజనల్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఐఆర్‌సీ) ఛైర్మన్‌ శంకర్‌ పి పనిక్కర్‌ అన్నారు.

Published : 05 Feb 2023 05:39 IST

మాట్లాడుతున్న శంకర్‌ పి పనిక్కర్‌, వేదికపై స్వామి, పి.వినయ్‌ రంజన్‌, పాపారావు, శ్రీనివాసరావు, పాండు రంగారావు

బెంజిసర్కిల్‌(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : ప్రస్తుతం, రానున్న రోజుల్లో సీఎంఏ కోర్సు చదివిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ), సౌత్‌ ఇండియా రీజనల్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఐఆర్‌సీ) ఛైర్మన్‌ శంకర్‌ పి పనిక్కర్‌ అన్నారు. ఐసీఏఐ, విజయవాడ ఛాప్టర్‌ ఆధ్వర్యంలో స్టేట్‌ లెవల్‌ సీఎంఏ స్టూడెంట్‌ కన్వెన్షన్‌, మయూఖ-2023 పేరుతో కార్యక్రమాన్ని శనివారం ఎంజీరోడ్డులోని శేషసాయి కల్యాణ వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్లేషణాత్మకమైన, వ్యాపారపరమైన, యాజమాన్య నిర్ణయాలను తీసుకోవడంలో సీఎంఏ విద్యార్థులే కీలకపాత్ర పోషిస్తున్నారని వివరించారు. వివిధ రంగాల్లో ఉన్నత హోదాల్లో ఉంటూ అత్యధిక వేతనాలు పొందడంతో పాటు సంస్థల పురోగతిలో భాగస్వాములవుతున్నారని చెప్పారు. ఐసీఏఐ సెంట్రల్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఎస్‌.పాపారావు మాట్లాడుతూ ఈ కోర్సుపై మరింత మందికి అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి వారిలోని సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికి తీస్తున్నామని పేర్కొన్నారు.  ఐసీఏఐ, ఎస్‌ఐఆర్‌సీ రీజనల్‌ కౌన్సిల్‌ సభ్యుడు కె.పాండు రంగారావు, విజయవాడ ఛాప్టర్‌ ఛైర్మన్‌ పీఎస్‌ఆర్‌ స్వామి, కార్యదర్శి పి.వినయ్‌ రంజన్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని