logo

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

అత్యంత అరుదైన సికిల్‌ సెల్‌ అనీమియా వ్యాధితో బాధపడుతున్న బాలిక చికిత్స కోసం తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

Published : 05 Feb 2023 05:39 IST

చికిత్స పొందుతున్న బాలిక

కొత్తఆస్పత్రి కూడలి, న్యూస్‌టుడే: అత్యంత అరుదైన సికిల్‌ సెల్‌ అనీమియా వ్యాధితో బాధపడుతున్న బాలిక చికిత్స కోసం తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. సింగ్‌నగర్‌కు చెందిన మీసాల రాజు దంపతుల కుమార్తె రాజేశ్వరి(15) తొమ్మిదో తరగతి చదువుతోంది. రాజు ఓ ప్రైవేటు సంస్థలో చిరుద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల రాజేశ్వరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు అన్ని పరీక్షలు జరిపి సికిల్‌ సెల్‌ అనీమియా కారణంగా మెదడు, గుండె, మూత్రపిండాలు తదితర ప్రధాన అవయవాలు పనిచేయడం లేదని గుర్తించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బిడ్డను రక్షించుకోవాలనే తపనతో తల్లిదండ్రులు అప్పు చేసి దాదాపు రూ.8 లక్షలు వరకు ఖర్చు చేశారు. ఇంకా రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న తన కుమార్తెను రక్షించుకునేందుకు దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని