APSLPRB: కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

ఏపీ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి.  రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా 95,208 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు.

Updated : 05 Feb 2023 12:03 IST

అమరావతి: కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (APSLPRB) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు. కానిస్టేబుల్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఓఎంఆర్‌ షీట్లు అందుబాటులో ఉంటాయని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది.

మొత్తం 6,100 పోస్టుల భర్తీ కోసం గతనెల 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో దీన్ని నిర్వహించినట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు తెలిపారు. 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీలకు 40 శాతం, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 30 శాతం కటాఫ్‌గా నిర్ణయించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని