logo

డా. కోటేశ్వరరావు సామాజిక సేవలు ఆదర్శనీయం

 మాజీ సర్పంచ్‌ డా. కోటేశ్వరరావు సామాజిక సేవలు ఆదర్శనీయమని విజయవాడ లోటస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కార్పొరేషన్ ఎండీ. 

Updated : 05 Feb 2023 16:05 IST

ఘంటసాల: మాజీ సర్పంచ్‌ డా. కోటేశ్వరరావు సామాజిక సేవలు ఆదర్శనీయమని విజయవాడ లోటస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కార్పొరేషన్ ఎండీ. వెంకటరామారావు, భవానీ ప్రసాద్‌ సోదరులు పేర్కొన్నారు. దేవరకోటలో రూ. 21 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ ముఖ ద్వారాన్ని, స్మారక వనాన్ని వెంకటరామారావు, భవనీ ప్రసాద్‌లతో పాటు ఆంధ్రవిశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ అట్లూరి అశోక్‌లు ఆదివారం ప్రారంభించారు. డా. కోటేశ్వరరావు  సామాజిక సేవలకు గుర్తింపుగా రైతు ఆంజనేయులు, డా. కోటేశ్వరరావు మార్బుల్‌ విగ్రహాలను  స్మారకవనంలో ఏర్పాటు చేశారు. డా. కోటేశ్వరరరావు సంస్మరణ సభను నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డా. కోటేశ్వరరావు సతీమణి షీల, ఆంజనేయ చరణ్‌, పల్లవి, రత్నగిరిరావు, సర్పంచ్‌ వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు. 

 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని