బైక్ ఢీకొని బాలుడి దుర్మరణం
స్థానిక బంటుమిల్లి రోడ్డులో కృష్ణ తులసి థియేటర్ వద్ద ఆదివారం రాత్రి 9.30కు జరిగిన ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
పెడన, న్యూస్‌టుడే : స్థానిక బంటుమిల్లి రోడ్డులో కృష్ణ తులసి థియేటర్ వద్ద ఆదివారం రాత్రి 9.30కు జరిగిన ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. నరసరావుపేట సమీపంలోని ఇప్పర్లరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అదిపూడి నాగరాజు కుటుంబం ఉపాధి కోసం గత రెండు నెలలుగా మండలంలోని మడక గ్రామంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం సినిమాకు వెళ్లేందుకు భార్య, కుమారుడు దుర్గాప్రసాద్ (7)తో కలిసి పెడన వచ్చిన నాగరాజు కృష్ణతులసీ థియేటర్ వద్ద ఆటో దిగుతుండగా ఎదురుగా వస్తున్న బైక్ బాలుడుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే బాలుడు మృతిచెందగా బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగ్రాతుడిని పెడన 7 వార్డుకు చెందిన యూసఫ్ అలీ(25)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడ్ని ముందుగా మచిలీపట్నం, తరువాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్గాప్రసాద్ మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు ఏఎస్‌ఐ రమేష్ చెప్పారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..
-
India News
Amritpal Singh: ‘ఆపరేషన్ అమృత్పాల్’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!
-
Movies News
RRR: ‘ఆస్కార్’కు అందుకే వెళ్లలేదు.. ఆ ఖర్చు గురించి తెలియదు: ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత
-
Politics News
Andhra News: వైకాపాతో భాజపా కలిసిపోయిందనే ప్రచారం.. నష్టం చేసింది: భాజపా నేత మాధవ్