logo

సహాయ ఆడిట్‌ అధికారి ఆత్మహత్య

సహాయ ఆడిట్‌ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనమలూరు మండలం పోరంకి వసంత్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది.

Published : 06 Feb 2023 05:37 IST

అంగీరసబాబు మృతదేహం

పెనమలూరు, న్యూస్‌టుడే: సహాయ ఆడిట్‌ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనమలూరు మండలం పోరంకి వసంత్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిగురుపాటి అంగీరసబాబు(34) విజయవాడలోని ఆడిటర్‌ జనరల్‌ కార్యాలయంలో సహాయ అధికారిగా పని చేస్తున్నారు. అంతకు ముందు హైదరాబాద్‌లో పని చేసి కొంతకాలం క్రితం బదిలీపై విజయవాడ వచ్చారు. అప్పటి నుంచి అంగీరసబాబు పోరంకి వసంత్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నారు. ఇతనికి 2014లో ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెంకు చెందిన అనూషతో వివాహం జరిగింది. వారికి ఏడేళ్ల కుమార్తె ఉంది. ఆదివారం ఉదయం అతడు ఇంట్లోని ఓ గదిలో కిందపడి విగతజీవిగా ఉండటాన్ని భార్య అనూష గుర్తించి మామ సాంబశివరావుకు తెలుపగా ఆయన వెంటనే వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా.. మృతుడు బెల్టుతో ఉరివేసుకుని ఉన్నట్టు గుర్తించారు. కానీ బెల్టు తెగి కిందపడటంతో తలపగిలి చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు