logo

సీపీఎస్‌ రద్దు చేసే వరకు ఉద్యమాలు

సీపీఎస్‌ రద్దుచేసి పాత పింఛను పునరుద్ధరించే వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని యూటీఎఫ్‌ నాయకులు హెచ్చరించారు.

Published : 06 Feb 2023 05:37 IST

నిరసనదీక్షలో పాల్గొన్న నాయకులు

మచిలీపట్నం కార్పొరేషన్‌,న్యూస్‌టుడే: సీపీఎస్‌ రద్దుచేసి పాత పింఛను పునరుద్ధరించే వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని యూటీఎఫ్‌ నాయకులు హెచ్చరించారు. గన్నవరంలో నిర్వహించాల్సిన సంకల్ప దీక్షను ప్రభుత్వం పోలీసులతో భగ్నం చేసినందుకు నిరసనగా రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మచిలీపట్నంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్న 3గంటల వరకు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర నాయకులు కేఏ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పాతపింఛను అడిగితే పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేయడం సమంజసం కాదన్నారు. సంఘ జిల్లా అధ్యక్షులు బి.కనకారావు మాట్లాడుతూ సీపీఎస్‌, జీపీఎస్‌లు పాత పింఛను విధానానికి ప్రత్యామ్నాయాలు కాదని అన్నారు.  ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసిన తరువాత భద్రత ఇచ్చే పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నామన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.లెనిన్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా నిరంశకుశంగా వ్యవహరిస్తూ శాంతియుతంగా చేసే నిరసన కార్యక్రమాలను పోలీసు బలగాలను ప్రయోగించి అణిచి వేస్తారా అంటూ దుయ్యబట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేసేవరకు రాజీలేని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎమ్‌డీ షౌకత్‌హుస్సేన్‌, జె.ఝాన్సీ, ఎన్‌.వెంకటేశ్వరరావు, అబ్ధుల్‌హబీబ్‌, టి.గంగరాజు,. ఎల్‌.నరేంద్ర, జె.ప్రసాదరావు, ఆర్‌.రామారావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు