logo

తెదేపా నాయకుడి ద్విచక్ర వాహనం దహనం

ఇంటి బయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలం గూడెం మాధవరంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

Published : 06 Feb 2023 05:37 IST

వీరులపాడు, న్యూస్‌టుడే : ఇంటి బయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలం గూడెం మాధవరంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు, తెదేపా నాయకుడు గద్దె వెంకటేశ్వరరావు వివరాల మేరకు... శనివారం మధ్యాహ్నం వ్యక్తిగత పనుల నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై తెలంగాణ రాష్ట్రం ఎర్రుబాలెం వెళ్లి వచ్చి ఇంటి ఎదురుగా వాహనాన్ని ఉంచారు. ఆయన కుమార్తె ఉద్యోగ పనుల రీత్యా అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెలకువగానే ఉన్నారు. తెల్లవారుజామున మూత్ర విసర్జనకు బయటకు వచ్చి చూడగా ద్విచక్ర వాహనం కాలిపోయినట్లు గుర్తించారు. ఆ ప్రదేశంలో డీజిల్‌ మరకలు కూడా ఉన్నాయి. కాలిపోయిన ద్విచక్ర వాహనం విలువ రూ.1.80 లక్షలు. సుబాబుల్‌ వ్యాపారం నిర్వహించే తనకు శత్రువులు ఎవరూ లేరని తెలిపారు. ఘటనపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు