logo

రూ.కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం

గొల్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలో రూ.4కోట్లకు పైగా విలువైన భూమిని ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు.

Published : 06 Feb 2023 05:52 IST

గొల్లపూడి, న్యూస్‌టుడే

ఘటనా స్థలంలో అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు

గొల్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలో రూ.4కోట్లకు పైగా విలువైన భూమిని ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. గొల్లపూడి గ్రామంలోని ఆర్‌ఎస్‌ నం.128లో 40 సెంట్లు డొంక పోరంబోకు స్థలం ఉంది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ఆ స్థలం రూ.4కోట్లు పైగా పలుకుతుంది. అది తనదంటూ డొప్పల నిర్మల ఆక్రమించేందుకు ప్రయత్నించారు. స్థలాన్ని చదును చేయించి చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు.  సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఆ స్థలం ప్రభుత్వానికి సంబంధించినదని వారికి తెలిపారు. దీంతో నిర్మల, మరికొందరు ఆ స్థలం తమదని, తన తండ్రికి ఆ స్థలాన్ని కేటాయించాలంటూ పేర్కొన్నారు. కేటాయింపు పత్రాలను చూపించాలని రెవెన్యూ అధికారులు కోరగా ఆమె నుంచి సమాధానం లేదు. దీంతో నిర్మాణ పనులను ఆపివేయించి ప్రభుత్వ స్థలం అంటూ బోర్డును ఏర్పాటు చేయించారు. వ్యాపారవేత్త అయిన నిర్మల అధికార పార్టీకి చెందిన వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ విషయమై విజయవాడ గ్రామీణ మండలం ఇన్‌ఛార్జి తహసీల్దారు జి.విజయ్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా గొల్లపూడిలో ఆక్రమణకు ప్రయత్నించిన స్థలం ప్రైవేటు వ్యక్తులకు చెందినది కాదు ప్రభుత్వ స్థలం. ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారనే సమాచారం మేరకు అడ్డుకున్నామన్నారు. ఎవరైనా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చర్యలు చేపడతామని తెలిపారు.

ప్రహరీ నిర్మాణానికి తీసిన హాగర్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు