logo

నదిని నాశనం చేస్తున్నారు..

కృష్ణా నది గర్భంలోకి నేరుగా వ్యర్థాలను వదిలేస్తున్నారు. విజయవాడ నగరంలో డ్రైనేజిల నుంచి మురుగునీరు, పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను నేరుగా రిటైనింగ్‌ వాల్‌ మధ్యలో నుంచి గొట్టాల ద్వారా కృష్ణా నదిలోకి వదిలేస్తున్నారు.

Published : 07 Feb 2023 03:26 IST

ఈనాడు, అమరావతి: కృష్ణా నది గర్భంలోకి నేరుగా వ్యర్థాలను వదిలేస్తున్నారు. విజయవాడ నగరంలో డ్రైనేజిల నుంచి మురుగునీరు, పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను నేరుగా రిటైనింగ్‌ వాల్‌ మధ్యలో నుంచి గొట్టాల ద్వారా కృష్ణా నదిలోకి వదిలేస్తున్నారు.కృష్ణానదికి వరద పోటెత్తినప్పుడు పరివాహక ప్రాంతం కృష్ణలంకలో నివాసాలు మునిగిపోకుండా ఉండడం కోసం ఇటివల రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తి చేశారు.

శుద్ధి చేయని మరుగు నీటిని నేరుగా నదులు, కాలువల్లోకి వదలకూడదనే నిబంధన ఉన్నా అధికారులు మాత్రం మురుగునీరు, వ్యర్థాలు నేరుగా రిటైనింగ్‌ వాల్‌ మధ్యలోంచి నదిలోకి చేరేలా ఏర్పాట్లు చేశారు. కనకదుర్గా వారధి దగ్గర రిటైనింగ్‌ వాల్‌ నుంచి నదిలోకి మురుగునీరు భారీగా చేరుతోంది. కుప్పలకొద్ది ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. బ్యారేజి నుంచి నీటిని దిగువకు వదిలినప్పుడు ఈ వ్యర్ధాలన్ని ప్రవాహంలో కొట్టుకుంటూ చివరకి సముద్రం గర్భంలోకి చేరుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని