logo

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు ఉద్యమం

అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు ఉద్యమాలు చేస్తూనే ఉంటామని సంఘ నాయకులు హెచ్చరించారు.

Published : 07 Feb 2023 03:26 IST

నిరసనలో పాల్గొన్న సంఘ నాయకులు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు ఉద్యమాలు చేస్తూనే ఉంటామని సంఘ నాయకులు హెచ్చరించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సోమవారం మచిలీపట్నంలోని ధర్నాచౌక్‌లో ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ , హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వీ నరసింహారావు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.అధికారంలోకి రాగానే మెరుగైన వేతనాలు అందజేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు నిర్మలజ్యోతి, ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి, నాయకులు సీహెచ్‌ నాంచారమ్మ, ఉమారాణి, సువర్ణలత, రేవతి, గోపీలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు తమ సమస్యలు వివరించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వివిధ సంఘాల ముఖ్య ప్రతినిధులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు