logo

రావిని ఊరూరా తిప్పిన పోలీసులు

మాజీ ఎమ్మెల్యే, గుడివాడ నియోజకవర్గ తెదేపా బాధ్యుడు రావి వెంకటేశ్వరరావును పోలీసులు సోమవారం రాత్రి 11.45 గంటలకు పమిడిముక్కల పోలీస్టేషన్‌కు తీసుకొచ్చారు.

Published : 07 Feb 2023 03:26 IST

పమిడిముక్కల, పామర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే, గుడివాడ నియోజకవర్గ తెదేపా బాధ్యుడు రావి వెంకటేశ్వరరావును పోలీసులు సోమవారం రాత్రి 11.45 గంటలకు పమిడిముక్కల పోలీస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఉదయం గుడివాడలో నాగవరప్పాడు వద్ద ఇళ్ల కూల్చివేతపై నిరసన తెలిపి మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేపట్టిన నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా గుడివాడ పురపాలక సంఘం ఉన్నతాధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు రావిని అరెస్టు చేసి ఊరూరా తిప్పుతున్నట్టు తెదేపా నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా తొలుత గుడివాడ నుంచి గూడూరుకు, అక్కడి నుంచి పామర్రు, అనంతరం తోట్లవల్లూరు తీసుకెళ్లారు. తోట్లవల్లూరు నుంచి కరకట్టమీదుగా తిప్పుతూ అవనిగడ్డ తరలిస్తుండగా పమిడిముక్కల మండల తెదేపా నాయకులు మోటూరు వెంకటసుబ్బయ్య, లింగమనేని బాబూరావు, గుడివాడ తదితర ప్రాంతాల నాయకులు లంకపల్లి వద్ద అడ్డుకున్నారు. దీతో చేసేది లేక పమిడిముక్కల పోలీస్టేషనుకు తీసుకొచ్చారు. రావిని విడుదల చేయాలని, పోలీసుల చర్యకు నిరసనగా తెదేపా నాయకులు, కార్యకర్తలు స్టేషను వద్ద అర్ధరాత్రి దాటిన వరకూ నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని