logo

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్యకేసులో నిందితునికి జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం మచిలీపట్నానికి చెందిన జి. వెంకటేశ్వరరావు(వీరప్పన్న) ఇదే ప్రాంతానికి చెందిన సబీరున్సీనా అనే మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు.

Published : 07 Feb 2023 03:26 IST

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: హత్యకేసులో నిందితునికి జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం మచిలీపట్నానికి చెందిన జి. వెంకటేశ్వరరావు(వీరప్పన్న) ఇదే ప్రాంతానికి చెందిన సబీరున్సీనా అనే మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. అతను వేరే మహిళతో కూడా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడనే దానిపై ఇరువురి మధ్య వివాదం ఏర్పడింది. 2015 సెప్టెంబరు 13న సబీరున్నీసా ఇంట్లో వంట చేస్తున్న సమయంలో వెంకటేశ్వరరావు ఆమెపై కిరోసిన్‌ పోసి గ్యాస్‌పొయ్యిమీద తోసివేయడంతో మంటలు అంటుకోవడం గమనించి పారిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే ఏడాది అక్టోబరు 6న ఆమె ఆసుపత్రిలో మృతిచెందింది. అంతకుముందు న్యాయమూర్తి ఎదుట మరణవాంగ్మూలం కూడా ఇచ్చింది. ఈ ఘటనపై మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ నిర్వహించిన మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు నిందితుడిపై హత్యానేరం రుజువు కావడంతో జీవితఖైదు, రూ.1000ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ మట్టా రాందాసు 12మంది సాక్షులను విచారించి, వాదనలు వినిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు