logo

నిధులు, అధికారాలు లేకుండా వచ్చి ఏం ప్రయోజనం?

‘నిధుల్లేవు, అధికారాల్లేవు సమావేశానికి వచ్చి ఏం చేయాలి? గ్రామాల్లో ఏ పని చేయలేకపోతున్నాం.. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మొఖం కూడా చూపించలేని పరిస్థితి నెలకొంది.

Published : 08 Feb 2023 06:11 IST

మండల సమావేశంలో అధికార పార్టీ సభ్యుల అసంతృప్తి

హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: ‘నిధుల్లేవు, అధికారాల్లేవు సమావేశానికి వచ్చి ఏం చేయాలి? గ్రామాల్లో ఏ పని చేయలేకపోతున్నాం.. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మొఖం కూడా చూపించలేని పరిస్థితి నెలకొంది. ఏదో మొక్కుబడిగా వచ్చామంతే.’ అంటూ అధికార పార్టీ మద్దతుదార్లగా గెలిచిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మంగళవారం ఎంపీపీ నగేష్‌ అధ్యక్షతన జరిగిన బాపులపాడు మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కలిసి 51 మంది ఉంటే.. కేవలం 15 మందే హాజరయ్యారు. 17 శాఖలకు సంబంధించి సాధారణ సమీక్ష నిర్వహించేందుకు ఎజెండా రూపొందించగా.. వివిధ శాఖల అధికారులు సైతం డుమ్మా కొట్టారు. వచ్చిన వారు సైతం తమ శాఖకు సంబంధించిన సమీక్ష పూర్తి కాగానే వెళ్లిపోయారు. ఇకపై సమావేశానికి రాని అధికారులకు నోటీసులు పంపుతామంటూ ఎంపీడీవో ప్రభాకర్‌ పేర్కొన్నారు. వైస్‌ ఎంపీపీ చందు రమాదేవి, ఉప తహసీల్దార్‌ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు