logo

జేఈఈ మెయిన్స్‌లో మెరిశారు

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఇటీవల నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌-2023 ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి.

Published : 08 Feb 2023 06:11 IST

కానూరు, న్యూస్‌టుడే: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఇటీవల నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌-2023 ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్స్‌ సాధించి సత్తా చాటారు. నగరానికి చెందిన డీవీ యుగేష్‌ 100 పర్సంటైల్‌ సాధించి టాపర్‌గా నిలిచారు. అలాగే జిల్లా నుంచి వందకు పైగా విద్యార్థులు 99 పర్సంటైల్‌ సాధించారు. వీరిలో ప్రణీతతేజ, అనిరుద్‌, రూబెన్‌ లారెన్సు, ఫణీంద్రరెడ్డి, ధర్మతేజరెడ్డిలు 99.99, మాజేటి తేజోరామ్‌ విగ్నేశ్వర్‌ 99.32, ఎంఎస్‌డీ ఆరిఫ్‌ 99.46, చిగురుపాటి హేమంత్‌ 99.10 పర్సంటైల్‌ సాధించారు. వీరే కాకుండా అత్యధిక విద్యార్థులు 99 పర్సంటైల్స్‌ పొందారు. మరో 1600 పైబడి విద్యార్థులు 90 పర్సంటైల్స్‌ పైన సాధించారు. జిల్లా నుంచి ఇప్పటి వరకు 95 పర్సంటైల్‌ పైబడి 750 మంది విద్యార్థులు ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 11 వేల మంది జేఈఈ మెయిన్స్‌ తొలి విడత పరీక్ష రాశారు. వీరంతా జేఈఈ అడ్వాన్సుడుకు అర్హత సాధించనట్లే. రెండో విడత పరీక్ష ఏప్రిల్‌లో జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని