logo

‘ఎన్టీఆర్‌, హరికృష్ణ పేరెత్తే అర్హత నానీకి లేదు’

 గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన అరాచకాలు, అన్యాయాలపై మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Published : 08 Feb 2023 06:11 IST

బాధిత కుటుంబాలతో మాజీ మంత్రులు దేవినేని, కొల్లు, తెదేపా నాయకులు

గుడివాడ (నెహ్రూచౌక్‌), న్యూస్‌టుడే:  గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన అరాచకాలు, అన్యాయాలపై మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాగవరప్పాడులోని నీటి పారుదల కాల్వ గట్టుపై నివాసముంటున్నవారి ఇళ్లను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టగా బాధిత కుటుంబాలను మంగళవారం వారు పరామర్శించారు. అనంతరం తెదేపా నియోజకవర్గ బాధ్యుడు రావి వెంకటేశ్వరరావు స్వగృహంలో నాయకులతోపాటు బాధిత మహిళలు కూడా మాట్లాడుతూ ఎమ్మెల్యే నానీపై విరుచుకుపడ్డారు. వైకాపాకు ఓటేసినందుకు బాగా బుద్ధి చెప్పారన్నారు. దళితులపై కక్షపూరితంగా వ్యవహరించడం నానీకి తగదన్నారు.

* నందివాడ మండలం అరిపిరాలలో ఎన్‌టీఆర్‌ ఎత్తిపోతల పథకానికి వైఎస్సార్‌ పేరు పెట్టడం దుర్మార్గ చర్య అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్టీఆర్‌ అభిమానినని చెప్పుకునే నానీకి ఆయన పేరు, హరికృష్ణ పేరు ఎత్తే అర్హత లేదన్నారు. జిల్లాలో కొడాలి నాని, పేర్ని నానీలు భూకబ్జాలు, రియాల్‌ దందాలు, క్యాసినోలు, ఇసుక మాఫియాలు చేస్తుంటారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. పోలీసులు రావి వెంకటేశ్వరరావు పట్ల దారుణంగా వ్యవహరించారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని