logo

అలా తవ్వారు.. ఇలా నీళ్లొదిలారు

గన్నవరం పరిసర ప్రాంతాల్లో మట్టి అక్రమ తవ్వకాలను  పట్టించుకొనే నాథుడే కరవయ్యారు. స్థానికంగా కొండలు, చెరువులు, పోలవరం కట్టలను రాత్రి, పగలు అన్న తేడా లేకుండా తవ్వేస్తున్నారు.

Published : 08 Feb 2023 06:11 IST

గత జూన్‌లో కొండపావులూరు శివారులో తవ్వుతున్న దృశ్యం

న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం: గన్నవరం పరిసర ప్రాంతాల్లో మట్టి అక్రమ తవ్వకాలను  పట్టించుకొనే నాథుడే కరవయ్యారు. స్థానికంగా కొండలు, చెరువులు, పోలవరం కట్టలను రాత్రి, పగలు అన్న తేడా లేకుండా తవ్వేస్తున్నారు. తాటి చెట్టులోతు తవ్వడం, ఏమీ ఎరుగనట్లు ఏర్పడిన భారీ గోతుల్లో నీళ్లను వదులుతున్నారు. దీంతో పశుపోషకులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇష్టారాజ్యంగా జరుపుతున్న మట్టి తవ్వకాలను పట్టించుకొనే అధికారులు లేకపోవడం తమ పాలిట శాపంగా మారిందని రైతులు, ప్రజలు వాపోతున్నారు. మట్టి తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో పడిన చనిపోయిన పశువులు, రైతుల సంఖ్య పది దాటిందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అక్రమ మట్టి తవ్వకాలపై దృష్టి సారించాలని కోరారు.

నేడు: తవ్వకాల అనంతరం గుంతల్లో వదిలిన నీరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని