logo

16.27 లక్షల ఓటర్ల అనుసంధానం పూర్తి

జిల్లాలో ఇప్పటి వరకు 16.27 లక్షల మంది ఓటరు కార్డులను ఆధార్‌కు అనుసంధానించామని, ఇంకా 4 లక్షల మంది వివరాలు అనుసంధానం చేయాల్సి ఉందని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.

Published : 09 Feb 2023 01:19 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ డిల్లీరావు, వేదికపై డీఆర్వో మోహన్‌కుమార్‌

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, : జిల్లాలో ఇప్పటి వరకు 16.27 లక్షల మంది ఓటరు కార్డులను ఆధార్‌కు అనుసంధానించామని, ఇంకా 4 లక్షల మంది వివరాలు అనుసంధానం చేయాల్సి ఉందని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. మిగిలిన ప్రక్రియ పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల పాత్ర కీలకమని పేర్కొన్నారు. బూత్‌ స్థాయి అధికారి (బీఎల్వో), రాజకీయ పార్టీల ఏజెంట్ల సమన్వయంతో సహకరించాలని కోరారు. నగరంలోని కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. మార్చి నెల నాటికి అనుసంధాన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు. ముఖ్యంగా విజయవాడ నగగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి లక్షల చొప్పున అనుసంధానం జరగాల్సి ఉందన్నారు. జిల్లాలోని మిగతా గ్రామీణ నియోజకవర్గాల్లో ఇంకా లక్ష ఓటర్ల వివరాలు అనుసంధానం చేయాల్సి ఉన్నట్టు వివరించారు. దీనికోసం బీఎల్వోలతో నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నట్టు వెల్లడించారు. రాజకీయ పార్టీలు సహకారం అందించాలని సూచించారు. సమన్వయంతో పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించడానికి తోడ్పాటు అందించాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ శాఖ అధికారి కె.మోహన్‌కుమార్‌, వివిధ పార్టీల ప్రతినిధులు బి.వి.కృష్ణ (సీపీఎం), సి.హెచ్‌.కోటేశ్వరరావు (సీపీఐ), సి.హెచ్‌.ఉషారాణి (తెదేపా), వై.ఆంజనేయరెడ్డి (వైకాపా), బి.కిరణ్‌కుమార్‌ (కాంగ్రెస్‌) తదితరులు పాల్గొన్నారు.

హాజరైన వివిధ పార్టీల ప్రతినిధులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని