logo

ఇంటి స్థలం వస్తే.. కావాలనే పేర్లు తొలగించారు

తనకు నివేశన స్థలం మంజూరైతే కావాలనే వైకాపా నాయకులు తన పేరు తొలగించారని ఎమ్యెల్యే కైలే అనిల్‌కుమార్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది.

Published : 09 Feb 2023 02:01 IST

ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తున్న మహిళ

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : తనకు నివేశన స్థలం మంజూరైతే కావాలనే వైకాపా నాయకులు తన పేరు తొలగించారని ఎమ్యెల్యే కైలే అనిల్‌కుమార్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. చినపులిపాక గ్రామంలో బుధవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే పాల్గొనగా తమకు ఇంటి స్థలం మంజూరైతే సర్పంచి మా పేరు తొలగించారని మరో మహిళ అతని వద్ద మొరపెట్టుకుంది. ఓ ఇంట్లో ముగ్గురికి నివేశనా స్థలాలిచ్చారని, ఈ గ్రామంలో 12 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నామని మహిళ తెలిపింది. అర్హులమైన తమకు ఇవ్వకుండా చాలా మంది అనర్హులకు స్థలాలిచ్చారని పేర్కొంది. ఇంటి స్థలం ఇచ్చి మూడేళ్లు గడిచినా లేఔట్లో ఇంత వరకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేదని ఇంకో మహిళ ఎమ్మెల్యే వద్ద వాపోయింది.  జడ్పీటీసీ సభ్యుడు జొన్నల రామ్మోహన్‌రెడ్డి, సర్పంచి ఆరేపల్లి శివరామకృష్ణ(రాము), మాజీ ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని