logo

అంబేడ్కర్‌ పేరు ఎలా మార్చుతారు: తెదేపా

విదేశ విద్యాదీవెన పథకానికి ఉన్న అంబేడ్కర్‌ పేరు మార్చే హక్కు ముఖ్యమంత్రికి ఎవరిచ్చారంటూ పలువురు నాయకులు ప్రశ్నించారు.

Published : 09 Feb 2023 05:04 IST

నిరసనలో పాల్గొన్న నాయకులు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: విదేశ విద్యాదీవెన పథకానికి ఉన్న అంబేడ్కర్‌ పేరు మార్చే హక్కు ముఖ్యమంత్రికి ఎవరిచ్చారంటూ పలువురు నాయకులు ప్రశ్నించారు. ఈ పథకంలో చేసిన మార్పులను నిరసిస్తూ తెదేపా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అంగన్‌వాడీ, తెలుగు మహిళావిభాగాల ఆధ్వర్యంలో బుధవారం మచిలీపట్నంలోని ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రతి పేద విద్యార్థి విదేశాల్లో చదువుకోవాలనే సంకల్పంతో తమ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యాదీవెన పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని అన్నారు. తమ హయాంలో 4,923మంది విద్యార్థులకు రూ.364కోట్లు కేటాయిస్తే వైకాపా ప్రభుత్వం 213మంది విద్యార్థులకు రూ.19కోట్లు కేటాయించి, ప్రచారానికి రూ.20కోట్లు ఖర్చు చేశారంటూ విమర్శించారు. పామర్రు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్లకుమార్‌రాజా మాట్లాడుతూ పథకానికి తక్షణం జగన్‌ పేరు తొలగించి అంబేడ్కర్‌ పేరును కొనసాగించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.తెదేపా రాష్ట్ర బీసీ ఫెడరేషన్‌  ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, పిన్నింటి శ్రీనివాసరావు, ఆదినారాయణ, తలశిల స్వర్ణలత, ఖాజా, గోపు సత్యనారాయణ, బత్తినదాసుతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెక్కుసంఖ్యలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని