logo

ఎన్నాళ్లీ అవస్థలు?

కృష్ణా జిల్లా గన్నవరం.. అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం.. దేశ, విదేశాల నుంచి ఇక్కడకు రోజూ అనేక విమానాలు వస్తుంటాయి.

Published : 07 Mar 2023 04:32 IST

బల్లకట్టుపై పనులకు వెళ్లి వస్తున్న గ్రామస్థులు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గన్నవరం.. అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం.. దేశ, విదేశాల నుంచి ఇక్కడకు రోజూ అనేక విమానాలు వస్తుంటాయి. కానీ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న జక్కులనెక్కలం గ్రామస్థులు మాత్రం ఎక్కడో మారుమూల కుగ్రామంలో మాదిరిగా రోజూ బల్లకట్టుపై ఆపసోసాలు పడి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ గ్రామానికి, పొలాలకు మధ్యన ఏలూరు కాల్వ ప్రవహిస్తోంది. రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లడానికి, ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కూలీలు పని ప్రదేశాలకు వెళ్లడానికి బల్లకట్టుపై ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం సాగించాల్సిందే. లేదంటే గూడవల్లి వద్ద 16వ జాతీయ రహదారిని చేరుకుని కేసరపల్లి మీదుగా ఎనిమిది కి.మీ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది వ్యయ, ప్రయాసలతో కూడుకున్నది. బల్లకట్టుపై ప్రయాణించే చోట వంతెన నిర్మిస్తే 50 ఏళ్లుగా తాము పడుతున్న కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా నాలుగు గ్రామాలతో అనుసంధానం పెరుగుతుందని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇలా తీగను పట్టుకుని లాక్కుంటూ నడపాల్సిందే

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు