logo

బైక్‌పై తిరుగుతోందని ప్రియురాలి ఇంటి వద్ద ప్రియుడి ఆత్మహత్యాయత్నం

ప్రియురాలు తన ఎదురుగా ద్విచక్ర వాహనంపై తిరుగుతుండడంపై మనస్తాపం చెందిన ఓ ప్రియుడు ఆమె ఇంటి వద్దకు వెళ్లి శరీరంపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

Published : 20 Mar 2023 09:16 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రియురాలు తన ఎదురుగా ద్విచక్ర వాహనంపై తిరుగుతుండడంపై మనస్తాపం చెందిన ఓ ప్రియుడు ఆమె ఇంటి వద్దకు వెళ్లి శరీరంపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని మార్వాడీ గుడి సమీపంలో నివాసం ఉండే బవర్‌ సింగ్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట తేనీరు దుకాణం నిర్వహిస్తున్నాడు. అతని రెండో కుమారుడు శైలేష్‌సింగ్‌(26) పట్టణానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. అతను ప్రేమించిన యువతి ఇటీవల ద్విచక్రవాహనం కొనుక్కొని చక్కర్లు కొట్టడం శైలేష్‌సింగ్‌కు నచ్చలేదు. విషయాన్ని ఆమెకు చెప్పినా వినకపోవడంతో మనస్తాపం చెందిన అతను ఆదివారం సాయంత్రం తన ప్రియురాలి ఇంటి వద్దకు వెళ్లి నువ్వు పదే పదే ద్విచక్రవాహనంపై తిరిగితే నేను చనిపోతానని యువతిని బెదిరించాడు.

నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని ఆమె బదిలివ్వడంతో మనస్తాపానికి గురైన శైలేష్‌సింగ్‌ ప్రియురాలి ఇంటిపైన నివాసం ఉండే వారి ఇంటి వద్దకు వెళ్లి శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు అతడ్ని 108 సాయంతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 80 శాతానికిపైగా శరీరం కాలిపోయిన శైలేష్‌సింగ్‌ పరిస్థితి విషమించంతో న్యాయమూర్తి అతని నుంచి మరణ వాంగ్మూలం సేకరించారు. మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని