logo

నిజ జీవితంలో ఓ సంఘటనే ‘బలగం’

నగరంలో ఆదివారం బలగం చిత్రబృందం సందడి చేసింది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఆదివారం బెంజిసర్కిల్‌ సమీపంలోని ట్రెండ్‌సెట్‌మాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

Published : 20 Mar 2023 06:11 IST

మాట్లాడుతున్న దర్శకుడు వేణు. చిత్రంలో ప్రియదర్శి, కావ్యకల్యాణ్‌రామ్‌

బెంజిసర్కిల్‌ (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: నగరంలో ఆదివారం బలగం చిత్రబృందం సందడి చేసింది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఆదివారం బెంజిసర్కిల్‌ సమీపంలోని ట్రెండ్‌సెట్‌మాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు, ప్రముఖ హాస్యనటుడు వై.వేణు మాట్లాడుతూ బలగం సినిమాను ప్రేక్షకులు ఆదరించారని, విడుదలై మూడో వారం అవుతున్నా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారన్నారు. చాలా మంది తెలంగాణ సంస్కృతి అంటున్నారని, ఇది తప్పు అని ఇది తెలుగు సినిమా అన్నారు. నా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన సినిమాలో చూపించానని, ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. చిన్న సినిమాను పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షక దేవుళ్లకు అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో కథానాయకుడు ప్రియదర్శి, నాయిక కావ్య కల్యాణ్‌రామ్‌, నిర్మాతలు హర్షిత్‌రెడ్డి, హన్షిత, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ బండి రత్నకుమార్‌, జీ 3 మూవీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఎం.గిరి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని