logo

ఉప్పెనలా కదలివచ్చారు

ఎక్కడికక్కడ అంగన్‌వాడీ కార్యకర్తలను ఆపినా.. ఎవరూ ఊహించని విధంగా విజయవాడ నగరానికి తరలివచ్చారు. పోలీసుల తనిఖీలను కూడా తప్పించుకుని.. తమ డిమాండ్ల సాధన కోసం వేలాది మంది ఉప్పెనలా కదలివచ్చారు.

Published : 21 Mar 2023 04:48 IST

ఈనాడు, అమరావతి

పోలీసు వ్యాన్లకు అడ్డంగా నిలబడిన నిరసనకారులు

ఎక్కడికక్కడ అంగన్‌వాడీ కార్యకర్తలను ఆపినా.. ఎవరూ ఊహించని విధంగా విజయవాడ నగరానికి తరలివచ్చారు. పోలీసుల తనిఖీలను కూడా తప్పించుకుని.. తమ డిమాండ్ల సాధన కోసం వేలాది మంది ఉప్పెనలా కదలివచ్చారు. వీరిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ధర్నా చౌక్‌ మార్గంలో రాకపోకలను నిలుపుదల చేశారు. వందలాది మంది పోలీసులను మోహరించారు. ఒక్కసారిగా ఆందోళనకారులు ధర్నాచౌక్‌ సమీపంలోకి వచ్చి మెరుపు నిరసనలకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏలూరు రోడ్డులోకి వేలాది సంఖ్యలో వివిధ జిల్లాల నుంచి చేరుకున్నారు. ట్రాఫిక్‌ స్తంభించడంతో పోలీసులు అప్సర థియేటర్‌ కూడలి నుంచి వాహనాలను మళ్లించారు. లెనిన్‌ సెంటర్‌ నుంచి అప్సర వైపు వచ్చే వాహనాలను సూర్యారావుపేట, బందరు రోడ్డు మీదుగా పంపించారు. కార్యకర్తలను అరెస్టు చేసి, స్టేషన్లకు తరలించినా పట్టువిడవకుండా అక్కడ కూడా ఆందోళన కొనసాగించారు. తమపై ఉక్కుపాదం మోపి అరెస్టులు చేయించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం యూనియన్‌ నాయకులతో తక్షణం చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. తమకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. తమకు సంక్షేమ పథకాలు, గ్రాట్యుటీ, డీఏలు, టీఏలు, అమలు చేయాలన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు సీహెచ్‌ బాబూరావు ఆధ్వర్యంలో ర్యాలీ
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు