logo

జగనన్నా.. కాలనీలోకి వెళ్లేదెలా..?

తుపాను కారణంగా కురిసిన వర్షాలకు అవనగడ్డ నియోజకవర్గంలోని అతి పెద్ద జగనన్న కాలనీ (ఎడ్లంక రహదారిలో) రహదారులు బురదమయంగా తయారయ్యాయి. దీంతో కాలనీ లోపలకు వెళ్లడానికి దారిలేని పరిస్థితి ఏర్పడింది.

Published : 21 Mar 2023 04:48 IST

బురదతో లబ్దిదారుల అవస్థలు

న్యూస్‌టుడే, అవనిగడ్డ

తుపాను కారణంగా కురిసిన వర్షాలకు అవనగడ్డ నియోజకవర్గంలోని అతి పెద్ద జగనన్న కాలనీ (ఎడ్లంక రహదారిలో) రహదారులు బురదమయంగా తయారయ్యాయి. దీంతో కాలనీ లోపలకు వెళ్లడానికి దారిలేని పరిస్థితి ఏర్పడింది. ఇసుక, కంకర, ఇనుము, సిమెంటుతో పాటు బోర్లు వేయడానికి, సెంట్రింగ్‌ సామగ్రి తరలింపు, కాంక్రీట్‌ మిక్చర్‌ వంటి యంత్రాలు లోపలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. బేస్‌మెంట్‌ వరకు వచ్చిన నిర్మాణాల్లో పోయడానికి మట్టి, బుసక లేకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. బుసక ఉచితంగా ఇవ్వాలని కోరుతున్నారు. టిప్పర్‌ బుసక రూ.12 వేలు చొప్పున కనీసం 4 టిప్పర్లు బుసక తోలి నింపాల్సి ఉంటుందని తాపీ పనివారు చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో కాలనీలో గృహం పూర్తికావాలంటే రూ.7.5 లక్షలకుపైగా వెచ్చించాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాపీ పని వారికి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలు చెల్లించాల్సివస్తోందని.. తక్కువ ఖర్చుతో నిర్మాణాలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పలు కాలనీల్లో బోరింగ్‌ పంపులు, ఇనుము, ఇటుకలు, నీటి డ్రమ్ములు దొంగిలిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారులు అభివృద్ధి చేయాలని, కంకరపోసి, వాహనాలు కూరుకుపోకుండా చేయాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు కాలనీలో అన్ని గృహాలకు కుళాయిలు ఏర్పాటు చేయలేదని, విద్యుత్తు వసతి కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని, లేకపోతే పట్టాలు రద్దు చేస్తామని చెప్పిన అధికారులు వసతుల కల్పన విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి వసతులు కల్పించాలని కోరుతున్నారు.

అంతర్గత రోడ్ల దుస్థితి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని