logo

అన్నదాతలను ఆదుకోవాలి

అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

Published : 21 Mar 2023 04:48 IST

ధర్నా నిర్వహిస్తున్న రైతు, కౌలురైతు సంఘ నాయకులు, రైతులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు బకాయిలు, ఆఫ్‌లైన్‌ సమస్య, ఆర్బీకేల్లో ఇబ్బందులు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ రైతు సంఘం, కౌలురైతు సంఘం జిల్లా శాఖల ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు గౌరిశెట్టి నాగేశ్వరరావు, హరిబాబు, తదితరులు మాట్లాడుతూ రైతుల కళ్లనీళ్లు తుడిచేందుకు అన్నట్టుగా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయించిన వేలాది క్వింటాళ్ల ధాన్యానికి నెలలు గడుస్తున్నా నగదు చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు ప్రారంభించే క్రమంలో ఆర్బీకేల్లో తగినన్ని గోనెసంచులు ఏర్పాటు చేయాలన్నారు. సంఘ నాయకులు రామిరెడ్డి, అజయ్‌ఘోష్‌, తదితరులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంఘ నాయకులు, రైతులు ధర్నాలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని