గుండెపోటుతో విశ్రాంత ఐఏఎస్ అధికారి కన్నుమూత
విశ్రాంత ఐఏఎస్ అధికారి మోటూరి రాంబాబు (84) శ్రీనగర్‌కాలనీలోని ఆయన నివాసంలో గుండెపోటుతో సోమవారం కన్నుమూశారు.
మోటూరి రాంబాబు
హైదరాబాద్, న్యూస్‌టుడే: విశ్రాంత ఐఏఎస్ అధికారి మోటూరి రాంబాబు (84) శ్రీనగర్‌కాలనీలోని ఆయన నివాసంలో గుండెపోటుతో సోమవారం కన్నుమూశారు. 1938లో కృష్ణాజిల్లా కొమరవోలులో జన్మించిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పలువురు గవర్నర్‌లకు కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ప్రభుత్వ జాయింట్ సెక్రెటరీగా, ఇన్‌ఛార్జి సెక్రెటరీగా పనిచేశారు. 1995లో పదవీ విరమణ తర్వాత ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి 2001 వరకు రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. ప్రస్తుతం శ్రీనగర్‌కాలనీ సంక్షేమ సంఘానికి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. రాంబాబు భౌతికకాయాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్ సందర్శించి నివాళులు అర్పించారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సుదర్శన్‌రెడ్డి, ప్రధాన, కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, సభ్యులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. రాంబాబు సతీమణి విజయలక్ష్మి 2022లో అనారోగ్యంతో మృతిచెందారు. కుమార్తె సుజాత విశ్రాంత ఉపాధ్యాయిని, కుమారుడు రవిచంద్ర వ్యాపారంలో స్థిరపడ్డారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మంగళవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన
-
Movies News
Social Look: దెహ్రాదూన్‌లో అనన్య పాండే.. చీరలో అనసూయ హొయలు
-
Movies News
ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
World News
అవును.. నేను బైసెక్సువల్‌ను: అందాల భామ సంచలన ప్రకటన
-
Politics News
Smriti Irnai: మంత్రి మిస్సింగ్ అంటూ కాంగ్రెస్ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ!