logo

గాలివాన బీభత్సం

ద్రోణి ప్రభావంతో గత అయిదు రోజులుగా కురుస్తున్న గాలివాన అన్నదాతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట, గంగలపగూడెం మండలాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.

Published : 21 Mar 2023 04:48 IST

వేలాది ఎకరాల్లో పంటల నష్టం

తిరువూరు, ఎ.కొండూరు, న్యూస్‌టుడే: ద్రోణి ప్రభావంతో గత అయిదు రోజులుగా కురుస్తున్న గాలివాన అన్నదాతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట, గంగలపగూడెం మండలాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దాదాపు రెండు గంటల పాటు కుండపోతతో తిరువూరు పట్టణంలో రహదారులు జలమయమవగా, కొన్ని ఇళ్లలోని మురుగు నీరు ప్రవేశించింది. రోడ్లపై పేరుకున్న చెత్తాచెదారంతో ప్రజలు, వాహనచోదకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోలుపడిలో చెట్లు వేళ్లతో సహా కూలి ఇళ్లపై పడ్డాయి. ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గాలుల తీవ్రతకు ఇళ్ల పైకప్పుగా వేసుకున్న సిమెంట్‌ రేకులు లేచిపోయి దూరంగా పడ్డాయి. తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలింది. మొక్కజొన్న కండెలు గింజ పోసుకునే దశలో నేలమట్టం అవడంతో అపార నష్టం వాటిల్లిందని కర్షకులు వాపోతున్నారు. ఎ.కొండూరు మండలంలో నేలావాలిన మొక్కజొన్న పంటలను ఏవో టిప్పుసుల్తాన్‌, ఏఈవో అగ్నిపర్తి రామచంద్రరావు పరిశీలించి ప్రాథమికంగా నష్టం అంచనా వేశారు. మరోవైపు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కోతకు వచ్చిన మామిడి కాయలు నేలరాలాయి. ఎకరానికి టన్ను చొప్పున రాలినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎ్కడ చూసినా మామిడి చెట్ల కింద రాలిన కాయలు గుట్టలుగా దర్శనమిచ్చాయి. ఆర్థికంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

దీప్లానగర్‌తండా సమీపంలో..
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు