logo

‘చలో దిల్లీ’ జయప్రదానికి పిలుపు

వచ్చే నెల 5, 6 తేదీల్లో నిర్వహించే ‘చలో దిల్లీ’ ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు కోరారు.

Published : 21 Mar 2023 04:48 IST

చుట్టుగుంట, న్యూస్‌టుడే : వచ్చే నెల 5, 6 తేదీల్లో నిర్వహించే ‘చలో దిల్లీ’ ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు కోరారు. కృష్ణా జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చుట్టుగుంట బీఎస్‌ఎన్‌ఎల్‌, మాచవరం ఎస్సారార్‌ కళాశాల వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని కేంద్రం రద్దు చేయాలని చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. చట్టాలన్నింటినీ రద్దు చేసి, కార్మికులకు ప్రయోజనం లేని నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకురావాలనే ప్రయత్నాలు ఆపేయాలన్నారు. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు వైకాపా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయకుండా.. పెండింగ్‌ క్లయిమ్‌లు పరిష్కరించకుండా, బోర్డులోని నిధులను దొడ్డిదారిన తరలించిందని ఆరోపించారు. ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఇసుక కొరత, మెటీరియల్‌ ధరలు భారీగా పెరిగిపోవడంతో.. కార్మికులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై నిర్వహిస్తున్న చలో దిల్లీ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు ఎం.బాబూరావు, జి.కృష్ణ, సెంట్రల్‌ సిటీ కమిటీ సభ్యులు రామకృష్ణ, రాము, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని