logo

పంట నష్టానికి పరిహారం ప్రకటించాలి

గత అయిదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న టమోటో, మినుములు, మిర్చి పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ డిమాండ్‌ చేశారు.

Updated : 21 Mar 2023 16:24 IST

మోపిదేవి:  గత అయిదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న టమోటో, మినుములు, మిర్చి పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన పంటలు దెబ్బతిన్న గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని రైతులు ఆయనకు వివరించి కన్నీరు మున్నీరయ్యారు. పంటనష్టాన్ని అంచనా వేసి రైతులకు త్వరగా అందించాలని కోరారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు మల్లిఖార్జున్‌, శాసనగిరి, హన్మాన్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు