logo

విద్యార్థులకు కలెక్టర్‌ పాఠాలు

కలెక్టర్‌ రంజిత్‌బాషా ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పి ఆకట్టుకున్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన గూడూరు మండలంలోని తరకటూరు జడ్పీ ఉన్నత.

Published : 25 Mar 2023 04:16 IST

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: కలెక్టర్‌ రంజిత్‌బాషా ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పి ఆకట్టుకున్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన గూడూరు మండలంలోని తరకటూరు జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులను వివిధ పాఠ్యాంశాలపై ఆరా తీశారు. వారి పఠనాసక్తిని పరిశీలించారు. గణితంపై పట్టు సాధిస్తే చాలా సులువని అంటూ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణసంఖ్యలు, కరణీయ, అకరణీయ సంఖ్యల గురించి పిల్లలకు వివరించారు. బోర్డుపై రాసి వివిధ సంఖ్యలు.. వాటి మధ్య తేడాల గురించి ఆయన చెప్పిన తీరుపై ఉపాధ్యాయులు కూడా ఆశ్చర్యపోయారు. ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ విద్యార్థులకు సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలకు వెళ్లి అక్కడ చిన్నారులతో పాఠాలు చదివించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని