logo

ఇది జగనన్న లేఔటా..!?

మోదుమూడి ఎస్సీకాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఔట్‌ను చూసి గ్రామదర్శిని ప్రత్యేక అధికారి, ఉయ్యూరు డివిజన్‌ పంచాయతీ అధికారి  ఏఎన్‌వీ నాంచారరావు బిత్తర పోయారు.

Updated : 25 Mar 2023 12:14 IST

గ్రామ దర్శినిలో బిత్తరపోయిన ప్రత్యేకాధికారి

మోదుమూడి లేఔట్‌లో వసతులు కల్పించలేదని ప్రత్యేకాధికారి నాంచారరావుకు చెబుతున్న లబ్ధిదారుడు

మోదుమూడి (అవనిగడ్డ గ్రామీణం),న్యూస్‌టుడే: మోదుమూడి ఎస్సీకాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఔట్‌ను చూసి గ్రామదర్శిని ప్రత్యేక అధికారి, ఉయ్యూరు డివిజన్‌ పంచాయతీ అధికారి  ఏఎన్‌వీ నాంచారరావు బిత్తర పోయారు. గ్రామదర్శినిలో భాగంగా శుక్రవారం ఆయన గ్రామంలో పర్యటించి ఇది జగనన్న లేఔటా అని ప్రశ్నించారు. రహదారి బురదమయంగా ఉండటంతో పాటు విద్యుత్తు స్తంభాలు అలంకరప్రాయంగా ఉన్నాయని గుర్తించారు. మౌలిక వసతులు లేకుండా ఇళ్లు కట్టుకోమంటే ఎలా అని ఓ లబ్ధిదారుడు ప్రశ్నించారు. 32 మంది లబ్ధిదారులకు గానూ ఏడుగురే నిర్మాణాలు చేపట్టినట్లు ఆయన గమనించారు.

రైతు భరోసా కేంద్రంలో రైతులకు ఎటువంటి సేవలు అందడంలేదని గ్రామస్థుడు నారాయణతోపాటు రైతులు ఆరోపించారు.

అవనిగడ్డ, న్యూస్‌టుడే: జడ్పీ సీఈవో జి.శ్రీనివాసరావు స్థానిక గ్రామ పంచాయలోని 5 సచివాలయాల పరిధిలోని పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలను, గ్రామ సచివాలయాలను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని