క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం
సమాజం నుంచి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేలా కృషి చేద్దామని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ విభాగ అధికారి డా. ఎ.వెంకట్రావు పిలుపునిచ్చారు.
ర్యాలీలో పాల్గొన్న వైద్యులు వెంకట్రావు, బాలసుబ్రహ్మణ్యం తదితరులు
మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: సమాజం నుంచి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేలా కృషి చేద్దామని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ విభాగ అధికారి డా. ఎ.వెంకట్రావు పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మల్కాపట్నంలోని క్షయనివారణ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. కార్యాలయం నుంచి బుట్టాయిపేట మీదగా రామానాయుడు పేట వరకూ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో కళాజాతాలో భాగంగా బుర్రకథలు, సమావేశాలు నిర్వహించి టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. నిక్షయ్‌మిత్ర, టీబీ ఛాంపియన్స్‌లకు ప్రోత్సాహక బహుమతులతో పాటు మెమెంటోలు అందజేశారు. జిల్లా నూక్లిక్ మెడికల్ అధికారి ఎం.వేణుగోపాలకృష్ణ, డా. వై.బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు