logo

అప్రమత్తంగా ఉంటే అవకతవకలకు తావుండదు

ఎటువంటి అవతవకలకు తావులేకుండా పదో తరగతి పరీక్షలను సమర్థంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు దేవానందరెడ్డి అన్నారు.

Published : 25 Mar 2023 04:14 IST

మాట్లాడుతున్న దేవానందరెడ్డి, వేదికపై రేణుక, రవికుమార్‌ తదితరులు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ఎటువంటి అవతవకలకు తావులేకుండా పదో తరగతి పరీక్షలను సమర్థంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు దేవానందరెడ్డి అన్నారు. పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ అధికారులు, కస్టోడియన్‌, సంయుక్త కస్టోడియన్లకు శుక్రవారం నిర్వహించిన మాంటిస్సోరి ఆడిటోరియంలో శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 154 పరీక్షా కేంద్రాల్లో 30,134 మంది పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణ, నిబంధనలపై వివరించారు. అప్రమత్తంగా విధులు నిర్వహించాలని కోరారు. డీఈవో సీవీ రేణుక, ఉప తనిఖీ అధికారి కొండా రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని