logo

అందుబాటులోకి పొంగళ్ల షెడ్డు

ఘాట్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన గ్యాస్‌ పొంగళ్ల షెడ్డును భక్తులు వినియోగించుకోవాలని దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు కోరారు.

Published : 25 Mar 2023 04:14 IST

ప్రారంభిస్తున్న పాలకమండలి ఛైర్మన్‌ రాంబాబు, స్థానాచార్య శివప్రసాదశర్మ, సభ్యులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : ఘాట్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన గ్యాస్‌ పొంగళ్ల షెడ్డును భక్తులు వినియోగించుకోవాలని దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు కోరారు. కొవిడ్‌ కారణంగా మూడేళ్ల పాటు మూసివేసిన పొంగళ్ల షెడ్డును శుక్రవారం పునః ప్రారంభించిన అనంతరం రాంబాబు మాట్లాడారు. భక్తులు పొంగళ్ల మొక్కులు చెల్లించుకోవడానికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గ్యాస్‌ స్టౌవ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కట్టెల పొయ్యిలపై పొంగలి వండేందుకు సమస్యలు తలెత్తుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. కనకదుర్గానగర్‌లో కూడా పొంగళ్ల వండేందుకు అనువుగా మరో షెడ్డును ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో దేవస్థాన స్థానాచార్య శివప్రసాదశర్మ, ఏఈవోలు సీసీ రెడ్డి, రమేష్‌, పాలకమండలి సభ్యులు మాధవి, నాగమణి, రామసీత, శ్రీనివాసులు, కట్టా సత్తెయ్య, బుద్ధా రాంబాబు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు