logo

జాతీయ ఉపకార వేతనాలకు 292 మంది అర్హత

ఫిబ్రవరిలో నిర్వహించిన జాతీయ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) ఉపకార వేతనాల ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 292 మంది ఉపకార వేతనాలకు అర్హత సాధించారు.

Published : 25 Mar 2023 04:14 IST

మోపిదేవి, న్యూస్‌టుడే: ఫిబ్రవరిలో నిర్వహించిన జాతీయ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) ఉపకార వేతనాల ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 292 మంది ఉపకార వేతనాలకు అర్హత సాధించారు. ఎన్‌టీఆర్‌ జిల్లాలో 160 మంది, కృష్ణాలో 132 మంది చొప్పున అర్హత సాధించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగానికి ఆన్‌లైన్‌ ద్వారా జాబితాలు వచ్చాయని ఎన్‌టీఆర్‌, కృష్ణా జిల్లాల విద్యా శాఖాధికారులు రేణుక, తాహెరా సుల్తానా శుక్రవారం తెలిపారు. అర్హుల జాబితాలకు సంబంధించి వివరాలు ఆయా పాఠశాలలకు సమాచారం అందించారు.

ఈ ఏడాది ఎన్‌టీఆర్‌ జిల్లాలో 2,637 మంది, కృష్ణా జిల్లాలో 3,482 మంది పరీక్షలకు దరఖాస్తు చేశారు. ఫిబ్రవరి 5న రెండు జిల్లాల్లోని 30 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

అర్హత సాధించిన వారికి వరుసగా నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.12 వేలు చొప్పున ఇంటర్‌ పూర్తయ్యే వరకు రూ.48 వేలు ఉపకార వేతనం కేంద్రం అందిస్తుంది. ఆర్థిక కారణాలతో మధ్యలో చదువు మానేయకుండా ఉండేందుకు, చదువు పట్ల మొగ్గు చూపాలనే దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది.

మోపిదేవి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుంచి కె.నవీన్‌ ఆదిత్య కుమార్‌ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయిని జయంతి శుక్రవారం తెలిపారు. విద్యార్థిని పాఠశాల కార్యదర్శి సబ్బినేని సాంబశివరావు, జయంతి అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని